మణిద్వీప వర్ణన - (తెలుగు)
మహాశక్తి
మణిద్వీప నివాసినీ
ముల్లోకాలకు
మూలప్రకాశినీ ।
మణిద్వీపములో
మంత్రరూపిణీ
మన మనసులలో
కొలువైయుంది ॥ 1 ॥
సుగంధ
పుష్పాలెన్నో వేలు
అనంత సుందర
సువర్ణ పూలు ।
అచంచలంబగు మనో
సుఖాలు
మణిద్వీపానికి
మహానిధులు ॥ 2 ॥
లక్షల
లక్షల లావణ్యాలు
అక్షర లక్షల
వాక్సంపదలు ।
లక్షల లక్షల
లక్ష్మీపతులు
మణిద్వీపానికి
మహానిధులు ॥ 3 ॥



