9581319000 info@paripurnananda.com WhatsApp
రామ సదానంద రామగోవింద

రామ సదానంద రామగోవింద

3 Views
View PDF
Bhajana Details & Devotional Lyrics

రామ సదానంద రామగోవింద

 

రామ సదానంద రామగోవింద

కామిత మందార ఘనదేవ బృంద

జో.. జో..

 

రామ సదానంద రామగోవింద

కామిత మందార ఘనదేవ బృంద

జో.. జో..

జో.. జో..

 

సురుచిర నవరత్న శోభిత హార

పరిపంథి వారిద పటల  సమీర

 

సురుచిర నవరత్న శోభిత హార

పరిపంథి వారిద పటల సమీర

జో.. జో..

జో.. జో..

 

జానకీ కుచయుగ చంద్ర చకోర

మానిత దేవాది దేవ విదూర

 

జానకీ కుచయుగ చంద్ర చకోర

మానిత దేవాది దేవ విదూర

జో.. జో..

జో.. జో..

 

పన్నగ శయనా సుపర్ణ తురంగ

కన్నడ సేయకు కరుణాంతరంగ

 

పన్నగ శయనా సుపర్ణ తురంగ

కన్నడ సేయకు కరుణాంతరంగ

జో.. జో..

జో.. జో..

 

కమనీయ మణిగణ కలిత కేయూర

విమల మౌక్తికహార విజయావతారా

 

కమనీయ మణిగణ కలిత కేయూర

విమల మౌక్తికహార విజయావతారా

జో.. జో..

జో.. జో..

 

ధరణిలో శ్రీరామ దాస శరణ్య

పరమాత్మ మువ్వ గోపాలాగ్రగణ్యా

 

ధరణిలో శ్రీరామ దాస శరణ్య

పరమాత్మ మువ్వ గోపాలాగ్రగణ్యా

జో.. జో..

జో.. జో..

 

రామ సదానంద రామగోవింద

కామిత మందార ఘనదేవ బృంద

 

రామ సదానంద రామగోవింద

కామిత మందార ఘనదేవ బృంద

జో.. జో..

జో.. జో..

Devotional Document
Home Panchang Book Pooja Donations Menu